విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరంలో మద్యం దుకాణానికి కొత్త నోటిఫికేషన్ లో అక్టోబర్ 19 వరకు దరఖాస్తుల స్వీకరణ. 21న లక్కీ డ్రా ఉంటుందని ఎక్సైజ్ సీఐ చంద్రమణి తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ధర్మవరం పరిధిలో రెన్యువల్ కాని రూరల్ మద్యం దుకాణానికి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎస్.కె.డి.వి. ప్రసాద్, జిల్లా ఎక్సైజ్ అధికారి నరసింహులు ఆదేశాల మేరకు కొత్త నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. గెజిట్ నంబర్ 74/2026 ప్రకారం, ధర్మవరం రూరల్ మండలంలోని మద్యం దుకాణానికి దరఖాస్తులను ఆహ్వానించారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 19వ తేదీ రాత్రి 11:59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఎక్సైజ్ స్టేషన్లో ఆఫ్లైన్ ద్వారా లేదా ఆన్లైన్లో సమర్పించవచ్చని, మినిమం నాలుగు అప్లికేషన్లు తప్పనిసరి అని తెలిపారు.అక్టోబర్ 21వ తేదీ ఉదయం 8 గంటలకు పుట్టపర్తి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ధర్మవరం లో మద్యం దుకాణానికి కొత్త నోటిఫికేషన్… ఎక్సైజ్ చంద్రమణి
- Advertisement -
RELATED ARTICLES


