విశాలాంధ్ర, గోరంట్ల,: పేద కుటుంబంలో పుట్టి చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మంగమ్మ కుటుంబానికి నిమ్మల శ్రీధర్ అండగా నిలిచారు. మంగమ్మ కుమార్తె చంద్రకళ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న నిమ్మల శ్రీధర్ గురువారం గుమ్మయ్యగారిపల్లికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.చంద్రకళకు దీర్ఘకాలిక వ్యాధికి సంబంధించిన పెన్షన్ మంజూరయ్యే వరకు పి-4 కార్యక్రమంలో భాగంగా ఆమెను దత్తత తీసుకుని ప్రతినెలా రూ.5 వేల చొప్పున పెన్షన్ తరహాలో ఆర్థిక సాయం అందిస్తానని శ్రీధర్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గురువారం తొలి విడతగా రూ.5 వేల నగదును టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి చేతుల మీదుగా చంద్రకళకు అందజేశారు. గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలో పేద ప్రజలకు విద్య, వైద్య అవసరాల్లో సహాయం అందిస్తూ నిమ్మల శ్రీధర్ ఆదర్శంగా నిలుస్తున్నారని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి, కూరబ మహేంద్ర, శ్రీకాంత్ యాదవ్, క్లస్టర్ ఇన్‌చార్జ్ రోహిత్, శ్రీశైలం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
వింత వ్యాధితో బాధపడుతున్న చంద్రకళకు నిమ్మల శ్రీధర్ ఆర్థిక సాయం..
- Advertisement -
RELATED ARTICLES


