విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో, కొత్తపేట మున్సిపల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల (3 పరీక్షా కేంద్రాలు) ల పరీక్షా కేంద్రాలలో ఎన్ఎంఎంఎస్ ప్రవేశ పరీక్షలు సజావుగా నిర్వహించడం జరిగిందని జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ లాజర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ధర్మవరంలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ముగ్గురు చీఫ్ ఆఫీసర్లు, ముగ్గురు డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో పాటు ఇన్విజిరేటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 240 మంది విద్యార్థులకు గాను 234 మంది పరీక్షలకు హాజరు హాజరు కావడం జరిగిందని, అదేవిధంగా ప్రభుత్వ జడ్పీ గర్ల్స్ హై స్కూల్ లో 168 మంది విద్యార్థులకు గాను 162 మంది విద్యార్థులు హాజరు, తదుపరి పట్టణములోని కొత్తపేటలో గల మున్సిపల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 153 మందికి గాను 147 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం జరిగిందని తెలిపారు. మొత్తం మూడు పరీక్ష కేంద్రాలలో561 మంది 543 మంది విద్యార్థులు హాజరుకాగా 96.8 శాతము నమోదు కావడం జరిగిందన్నరు. పరీక్ష ఫలితాలు మరో రెండు నెలలు రాగలవని తెలిపారు. మూడు పరీక్షా కేంద్రాలలో తాను ఆకస్మికంగా పరిశీలించడం జరిగిందని, పరీక్షా విధి విధానాల్లో తగిన సలహాలను సూచనలను పరీక్ష కేంద్ర ఇన్విజిలేటర్లకు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పరీక్ష చీప్ అధికారులు సుమన, రమేష్, శైలజ, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ప్రమీల, ఉమాపతి, అనంత పద్మనాభులు, పరీక్షా సిబ్బంది పాల్గొన్నారు.
సజావుగా ఎన్ఎంఎంఎస్ పరీక్షలు.. జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ లాజర్
RELATED ARTICLES