Homeఅంతర్జాతీయంహోర్మూజ్ నుంచి చుక్క చమురు దాటదు: ఇరాన్

హోర్మూజ్ నుంచి చుక్క చమురు దాటదు: ఇరాన్

- Advertisement -

తెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా దురాక్రమణ కొనసాగుతున్నంతకాలం ఒక్క చుక్క చమురు కూడా హోర్మూజ్‌ను దాటి వెళ్లదని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. ప్రతీకార చర్యలకు సిద్ధంగా ఉండాలని అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా హోర్మూజ్ మీదుగా వెళ్తోన్న రెండు నౌకలను ఐఆర్‌జీసీ టార్గెట్ చేసింది. వాటిలో పేలుడు సంభవించిందని, అవి కదల్లేని స్థితిలో ఉన్నాయని వెల్లడించింది. మరోవైపు ఇరాన్‌పై సోమవారం తెల్లవారుజామున అగ్రరాజ్యం మరోసారి దాడులు చేపట్టింది. తమ సైనికుల మరణాలకు ప్రతీకారం తీర్చుకున్నామని, శక్తిమంతమైన దాడులు చేశామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కొన్నిరోజుల క్రితం మొదలైన ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు అమెరికా వైపు ప్రాణనష్టం 17కు పెరిగింది. పశ్చిమాసియా దద్దరిల్లుతున్న నేపథ్యంలో చమురు ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్ ధర 90 డాలర్లకు చేరింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు