-తహశీల్దార్ పి.విజయకుమారి
విశాలాంధ్ర-రాప్తాడు : గ్రామంలో ఉన్న దేవాలయ భూములను ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేస్తామని తహశీల్దార్ పి.విజయకుమారి అన్నారు. మండలంలోని బుక్కచెర్ల గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములకు అన్ని పత్రాలు, రికార్డులు ఉన్నా ఆన్లైన్లో నిషేదిత భూములుగా నమోదయ్యాయని సమస్యను పరిష్కరించాలని ఓ రైతు కోరారు. వివిధ భూసమస్యలపై రైతులు పలు అర్జీలు అందజేశారు. దేవాదాయ శాఖ ఈఓ సుధారాణి మాట్లాడుతూ దేవాదాయ భూములను ఎలాంటి హక్కు లేకుండా ఇతరులు సాగు చేస్తున్నారని, వీటిని దేవుని తరపున మాత్రమే లీజుకు ఇస్తామన్నారు. దేవుని మాన్యం భూములను రెవెన్యూ రికార్డుల్లో ప్రయివేటు వ్యక్తులు నమోదు చేసుకున్నారని వాటిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆదినారాయణమ్మ, ఆర్ఐ కరుణాకర్, వీఆర్ఓ సాయి, పంచాయతీ కార్యదర్శి నవీన్, ఫీల్డ్ అసిస్టెంట్ ఓబిలేసు, నాయకులు శ్రీనివాసరెడ్డి, ఓబిలేసు, బ్రహ్మానందరెడ్డి సచివాలయ సిబ్బంది, వీఆర్ఏ తలారి కర్ణ తదితరులు ఉన్నారు.