Saturday, January 18, 2025
Homeఆంధ్రప్రదేశ్నిరుపేదల ఆరాధ్యుడు ఎన్టీఆర్

నిరుపేదల ఆరాధ్యుడు ఎన్టీఆర్

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : నిరుపేదల ఆరాధ్యుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టిడిపి సీనియర్ నాయకులు నాగభూషణ్ రెడ్డి, దశరథరాముడు, సిద్ధప్ప గౌడ్, ఇంద్రసేనారెడ్డి, నీలకంఠ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఆదేశాల మేరకు మండల యువనాయకులు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది, నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన, స్త్రీలకు సాధకారతనిచ్చిన సంస్కర్త నందమూరి తారక రామారావు అన్నారు. సమసమాజాన్ని సాధించుకునేందుకు ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం పని చేసేందుకు కంకణబద్దులై ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మబ్బు ఆంజనేయ,లక్ష్మన్న, బసవరాజు, గుమ్మల రాజేష్, కటిక బాబు, పంగ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు