విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం అవ్వా తాతలకు వరం లాంటిదని టీడీపీ మండల అధ్యక్షుడు బసలదొడ్డి ఈరన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏసేపు అన్నారు. శనివారం మండల బసలదొడ్డి గ్రామంలో మండల అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న, పెద్దకడబూరులో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏసేపు,బీసీ సెల్ నాయకులు తలారి అంజి, కంబదహాల్ గ్రామంలో టీడీపీ గ్రామ అధ్యక్షులు మునెప్ప, జాలవాడి లో టీడీపీ గ్రామ అధ్యక్షులు ముక్కన్న, హనుమాపురం గ్రామంలో టీడీపీ నాయకులు ఈరన్న, రాగిమాన్ దొడ్డిలో టీడీపీ నాయకులు వెంకటరెడ్డి లు వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వేలు పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయాన్నే ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దీంతో పేదల గుండెల్లో చంద్రబాబు నాయుడు ఎప్పటికీ నిలిచి పోతారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.