విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం లోని 29వ ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం ఎన్టీఆర్ ఆడిటోరియం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య , ఓ ఎస్ డి వీసీ ఆచార్య దేవన్న పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. తెలుగు నేలపై ఆత్మ గౌరవాన్ని నిలిపి, నిరుపేదల ఆకలి తీర్చి, ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ పి. చెన్నారెడ్డి, డైరెక్టర్లు, డి ఆర్, ఏ ఆర్ , అధ్యాపక బృందం, బోధనతర, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.