Sunday, January 19, 2025
Homeజిల్లాలుఅనంతపురంఎన్టీఆర్ వర్ధంతి..పామిడి ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ

ఎన్టీఆర్ వర్ధంతి..పామిడి ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ

విశాలాంధ్ర- పామిడి (అనంతపురం జిల్లా): టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు 29వ వర్థంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. పామిడి పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు ఈ సందర్బంగా పామిడి ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ యార్డ్ ప్రభాకర్ చౌదరి, మీడియా సమావేశంలో మాట్లాడుతూ కృష్ణాజిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. 1947లో ‘మనదేశం’తో ప్రారంభించి 1982 వరకు సుమారు 292 సినిమాల్లో నటించారు. పౌరాణిక పాత్రధారణలో ఎనలేని నైపుణ్యాన్ని ప్రదర్శించారు. 29-3-1982న ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపించి, తొమ్మిది నెలల కాలంలోనే (1983 మార్చి 9న) తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరు తెలుగువారికి చేసిన సేవలకు గుర్తింపుగా నవంబర్ 1న ‘తెలుగు ఆత్మగౌరవ దినోత్సవం’గా జరపాలని ఆంధ్రప్రదేశ్ “ప్రభుత్వం నిర్ణయించింది. వీరి పేరుతో 5 లక్షల నగదు బహుమతితో ఒక స్మారక అవార్డును ప్రతి సంవత్సరం ఒక చలనచిత్ర రంగ ప్రముఖుడికి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. ఈ కార్యక్రమంలో బొల్లు శ్రీనివాసులు రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గౌస్ పిరా, జింకల సంజీవ్ కుమార్, బొమ్మ మోహన్, మండ్ల శ్రీనివాసులు, వడ్డే శివకుమార్, నల్లబోతుల శ్రీనివాసులు, బాలరాజు, సుంకప్ప, హమాలి గోపాల్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు