విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్టీసీ కార్మికుల సమస్యల కోసం నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ వారు గత కొంతకాలంగా పోరాటాలను నిర్వహించారు. ఇందులో భాగంగా 01/2019 సర్కులర్ పై పలు పోరాటాలు చేసి తుదకు విజయం సాధించడం జరిగిందని రీజినల్ నాయకులు ఎస్. ఎం. సాబ్, మోహన్, డిపో చైర్మన్ హనుమాన్, అధ్యక్షులు ప్రభాకర్, కార్యదర్శి మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్ఎంయూ ఏ ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా పోరాడినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలను గేట్ మీటింగ్ నందు తెలియజేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఏదైనా తప్పిదాలు జరిగినప్పుడు చిన్న కారణాన్ని కూడా సస్పెన్షన్, జరిమానా, రిమూవల్ చేయడానికి నిరసిస్తూ తాము పోరాటాలను చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా పలు పర్యాయాలు యాజమాన్యముకు వినతి పత్రాలు, కూడా అందజేసి పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రిలే దీక్షలను చేయడం జరిగిందన్నారు. తదుపరి ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగం సంఘం నాయకులను చర్చలకు పిలవడం జరిగిందని, అందుకే సర్కులర్ నెంబర్ 01/2019 ద్వారా అమలు చేస్తామని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం స్వీట్స్ ను పంపిణీ చేసుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిపో నాయకులు శంకరయ్య ,వైవిఆర్ రెడ్డి, గోపాల్, నారాయణస్వామి, నాయక్ అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలపై విజయం సాధించిన ఎన్ ఎన్ యు ఏ సంఘం నాయకులు
RELATED ARTICLES