Thursday, May 29, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపార్వతీదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు బహుకరణ

పార్వతీదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు బహుకరణ

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పుట్టపర్తి రోడ్, సాయి నగర్ లో గల షిరిడి సాయిబాబా దేవాలయంలో నూతనంగా పార్వతి పరమేశ్వరుల ఆలయాన్ని ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం పూర్తి అయిన తర్వాత జూన్ 5వ తేదీన పార్వతీ పరమేశ్వర విగ్రహాలకు ప్రతిష్టాపన నిర్వహించిన దృష్ట్యా పట్టణంలోని ప్రముఖ వ్యాపారి జింకా రామాంజనేయులు వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టు వస్త్రాలను బహూకరించారు. తదుపరి ఆలయ కమిటీ వారు జింకా రామాంజనేయులు కు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. అదేవిధంగా పట్టణానికి చెందిన బి. మురళి, తల్లి బి. లక్ష్మీనారాయణమ్మ పేరుతో ఆలయమునకు రూ.5,111 లను విరాళంగా ఆలయ కమిటీ వారికి అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో దాతలకు వారి పేరిటన ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి ఘనంగా సత్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు