విశాలాంధ్ర- వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని కాకుటూరు, బొంతవారిపాలెం మరియు పోకూరు గ్రామాలలో ఫెంగల్ తుఫాన్ ప్రభావం వలన దెబ్బతిన్న పంటలను మంగళవారం మండల వ్యవసాయాధికారి ఎం. హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో కందుకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ పి అనసూయ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఈ వెంకటేష్ రైతులతో కలిసి పంటలను సందర్శించి పరిశీలించారు. శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రస్తుతం మినుము పంట పూత, పిందె దశలో ఉందని వర్షాల కారణంగా నీరు నిలబడకుండా కాలువలు తీసుకొని బయటకు పంపాలని కోరారు. చల్లని వాతావరణం వలన బూడిద తెగులు రాకుండా మైక్రో బుటానిల్ 1.0 గ్రామ్ ఒక లీటర్ నీటికి లేదా అమిస్టర్ టాప్ 0.5 మి. లీటర్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి అని, పల్లాకు తెగులు నివారణకు తెల్ల దోమ మందు అసెటమి ప్రైడ్ లేదా థయో మేథోజైమ్ 0.2 గ్రామ్ మరియు వేప నూనె 5 మి. లీ. ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి అని , ఆకు మచ్చ తెగులు నివారణకు మాన్కోజెబ్ 2.5గ్రామ్ మరియు సాఫ్ 2.5 గ్రామ్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి అని సూచించారు. అలాగే అగ్రోమిన్ మాక్స 2.5 గ్రామ్ మరియు 19:19:19 లేదా 13:0:45 పొడి ఎరువు 5గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి అని తెలిపారు, పొగాకు పొలం నాటు నుండి ఎదుగుదల దశలో ఉంది కావున పల్లపు ప్రాంతంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అని, తెలియజేసారు.వడలిపోయి వేరు తెగులు ఆశించిన పొలాల్లో కాపర్ ఆక్సీ క్లోరైడ్ 2.0గ్రాములు లీటర్ నీటికి మరియు ప్లాంటోమైసిన్ 1గ్రామ్ లీటర్ నీటికి కలిపి మొక్కల వేరు భాగంలో పోయాలని,తోటలు పాలిపోయినట్లు అయితే 13:0:45 ఒక కేజి ఎకరానికి పిచికారి చేయాలి అని,వర్షాలు ఆగిన తర్వాత పొటాషియం సల్ఫేటు 1కేజి ఎకరానికి చొప్పున రెండు సార్లు పిచికారి చేయాలి అని తెలియజేసారు. వరి పంట లో నీరు నిలబడకుండా కాలువలు తీసుకొని బయటకు పంపాలని తెలిపారు. కందుకూరు వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ పి అనసూయ మాట్లాడుతూ రైతులందరూ కూడా మినుము పంటకు పంటల భీమా తప్పనిసరిగా చేసుకోవలసినదిగా తెలిపారు రైతు కట్టవలసినది ఎకరానికి 38 రూపాయలు మరియు శనగ పంటకు ఎకరానికి 56 రూపాయలు కట్టినట్లయితే అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని దిగుబడులు తగ్గినట్లయితే భీమ వర్తిస్తుందని తెలిపారు బీమా కట్టుకోవలసిన వారు మీ గ్రామ రైతు సేవ కేంద్రం నందు సహాయ మరియు ఉద్యానవన సహాయకులను సంప్రదించి కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా నగదు చెల్లించి పంటలకు బీమా చేసుకోవలసినదిగా తెలపటమైనది ఈనెల డిసెంబర్ 15వ తేదీ చివరి రోజు కావున రైతులందరూ కూడా త్వరపడి సాగు చేసి ఉన్న మినుము మరియు శనగ పంటలకు భీమ చేసుకోవలసిందిగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యానవన సహాయకులు వి. ఖాదర్బాషా మరియు బద్దిపూడి శికామణి, ఇంటూరి కోటేశ్వరరావు, ఘట్టమనేని లక్ష్మీనరసింహం, బొల్లి లేని లక్ష్మీనరసింహం, మక్కేనా వెంకటేశ్వర్లు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.