రాజేశ్వరి దేవి,గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ, జిల్లా కలెక్టర్, డీఈఓ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణము, మండల పరిధిలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు ఈనెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారులు రాజేశ్వరి దేవి,గోపాల్ నాయక్ తెలిపారు. మైనారిటీ విద్యాసంస్థలకు మాత్రం ఈ నెల 11 నుండి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని వారు తెలిపారు. ఈ సమాచారాన్ని పాఠశాల హెడ్మాస్టర్లు ఉపాధ్యాయుల ద్వారా సర్కులర్ పంపాలని తెలిపారు. తదుపరి సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులు ఎవ్వరు కూడా తల్లిదండ్రులకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళరాదని తెలిపారు. అంతేకాకుండా వేరే ఊర్లకు వెళ్లినప్పుడు కూడా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉంటూ, అప్పుడప్పుడు పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు. సంక్రాంతి సెలవుల్లో ఎవ్వరు కూడా అదనపు తరగతులు నిర్వహించరాదని, ఫిర్యాదుల అందితే కఠినమైన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. కావున పాఠశాల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, ప్రభుత్వ పాఠశాలల హెడ్మాస్టర్లు గమనించి సహకరించాలని వారు తెలిపారు.
.
సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మండల విద్యాశాఖ అధికారులు..
RELATED ARTICLES