Monday, January 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయి4న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు సన్మానం కార్యక్రమం

4న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు సన్మానం కార్యక్రమం

ధర్మవరం పట్టణ చేనేత కులాల ఐక్యవేదిక నిర్వాహకురాలు సంకారపు జయశ్రీ
విశాలాంధ్ర ధర్మవరం:; చేనేత కుల బాంధవుడు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సన్మాన కార్యక్రమం జనవరి 4వ తేదీ శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నిర్వహిస్తున్నట్లు ధర్మవరం పట్టణ చేనేత కులాల ఐక్యవేదిక నిర్వాహకురాలు సంకారపు జయశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వాటికి సంబంధించిన కరపత్రాలను పట్టణంలోని తొగట వీర క్షత్రియ కళ్యాణ మండపంలో సభ్యులతో కలిసి విడుదల చేశారు. అనంతరం జయశ్రీ మాట్లాడుతూ ఈ సన్మాన కార్యక్రమం పట్టణంలోని శివానగర్ శివాలయము ప్రాంగణమునందు ఖాళీ ప్రదేశం నందు జరుగునని తెలిపారు. చేనేత కుల బాంధవుడు బిసి వర్గానికి చెందినటువంటి కందికుంట వెంకటప్రసాదను సన్మానించడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. ఏపీలో ఉన్నటువంటి 18 చేనేత కులాల వారికి ఒక పండుగ దినము అని తెలిపారు. అదేవిధంగా ధర్మవరం ప్రథమ పౌరురాలు అయినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ కాచర్లలక్ష్మి, ఆల్ ఇండియా రివర్స్ ఫెడరేషన్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్ ను రాజకీయాలకు అతీతంగా ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మన చేనేత కులాలను గౌరవించుకున్న వాళ్ళము అవుతామని తెలిపారు. ధర్మవరం పట్టణంలో దాదాపు 80 వేలకు పైగా ఉన్నటువంటి చేనేత కులాల వారు ప్రతి ఒక్కరు ఈ సన్మాన కార్యక్రమంలో హాజరై కుటుంబ సమేతంగా రావాలని తెలిపారు. అదేవిధంగా తోగాటవీర క్షత్రియ, పద్మశాలి, పట్టు శాలి, దేవాంగం, స్వకుల సాలె, కుర్ని, కత్రి చేనేత కుల బాంధవులు కూడా వేలాదిగా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సభలో చేనేతల సమస్యలు గూర్చి చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిర్రాజు రవి, గుద్దిటి రాము , బీరేగోపాల్, కొండా పుల్లయ్య, టీచర్ ప్రకాష్, పరిసే సుధాకర్, చింతా నాగరాజు, దాసరి రంగయ్య, హేమంత్, పామిశెట్టి శివశంకర్, బీరే కేశవ నీలూరి శ్రీనివాసులు ,గడ్డం శ్రీనివాసులు, గడ్డం పార్థ ,కోనేటి వెంకటేష్, పొట్టి ప్రసాద్, ఉక్కిసలగోవిందు, ఉక్కిసెల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు