Homeజిల్లాలుకర్నూలుగంగాదేవి జాతర సందర్భంగా పారిశుధ్య పనులు

గంగాదేవి జాతర సందర్భంగా పారిశుధ్య పనులు

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామ పంచాయతీ మజరా గ్రామం బాపురం గ్రామంలో శ్రీ గంగాదేవి జాతర సందర్భంగా గురువారం గ్రామ సర్పంచ్ బసమ్మ, టీడీపీ నాయకులు వీరేష్ గౌడ్, మాల శివ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రామ రహదారికి ఇరువైపులా ఉన్న దిబ్బలు, చెత్త చెదారంను జేసీబితో తొలగించారు. రథోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మహేష్, పంచాయతీ కార్యదర్శి దస్తగిరి, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు