Homeఅంతర్జాతీయంఅమెరికా డిమాండ్లుకు 15 నిమిషాలే సమయం ఇచ్చారు

అమెరికా డిమాండ్లుకు 15 నిమిషాలే సమయం ఇచ్చారు

- Advertisement -

డెన్సీ రోడ్రిగ్జ్‌ వీడియో లీక్‌

వెనెజువెలాపై సైనిక దాడి చేసి ఆ దేశాధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన భార్యను అమెరికా దళాలు నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తమకు ఎదురైన  సవాళ్ల గురించి తాత్కాలిక అధ్యక్షురాలు డెన్సీ రోడ్రిగ్జ్ ఫోన్లో మాట్లాడిన వీడియో ఒకటి తాజాగా లీక్‌ అయింది. తమ డిమాండ్లు అంగీకరిస్తారా.. లేక చస్తారా అని అమెరికా దళాలు బెదిరించినట్లు అందులో ఉంది. మదురో నిర్బంధం తర్వాత జరిగిన ఓ సమావేశానికి సంబంధించిన వీడియోలో.. రోడ్రిగ్జ్‌ ఫోన్‌ కాల్‌ ద్వారా మాట్లాడుతూ.. అధికారాన్ని కాపాడుకోవడమే తన ప్రాధాన్యత అని చెప్పినట్లుగా ఉంది. ’అధ్యక్షుడు కిడ్నాప్‌ అయిన తర్వాత నిమిషం నుంచే మాకు బెదిరింపులు మొదలయ్యాయి. డిమాండ్లపై స్పందించేందుకు నాకు, అంతర్గత మంత్రి డియోస్టాడో కాబెల్లో, నా సోదరుడు, మంత్రి జార్జ్‌ రోడ్రిగ్జ్‌లకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు. లేకుంటే వారు మమ్మల్ని చంపేస్తానని బెదిరించారు. మదురో ఆయన భార్యను కిడ్నాప్‌ చేయలేదు.. చంపేశాం అని యూఎస్ దళాలు మాకు చెప్పాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతలు స్వీకరించాల్సి రావడం బాధాకరం’ అని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. దేశంలో అధికార మార్పిడికి రోడ్రిగ్జ్‌ అమెరికాతో రహస్య డీల్‌ కుదుర్చుకున్నారనే ప్రచారం మొదలయ్యింది. గతేడాది నవంబరు నుంచే యూఎస్‌ అధికారులతో ఆమె సంప్రదింపులు జరిపారని ది గార్డియన్‌ పత్రిక పేర్కొంది. మదురోని తొలగించి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని రోడ్రిగ్జ్‌ చెప్పినట్లు సదరు కథనం వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు