అమెరికాకు చెందిన AI సంస్థ ఓపెన్‌ఏఐ సైబర్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు డేబ్రేక్ పేరుతో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భవిష్యత్‌లో సైబర్ దాడులను ముందుగానే గుర్తించి సాఫ్ట్‌వేర్‌లను సురక్షితంగా ఉంచే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇటీవల ఆంత్రోపిక్ విడుదల చేసిన క్లోడ్ మైథోస్ AI మోడల్‌పై హ్యాకింగ్ సామర్థ్యాల ఆరోపణలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా సైబర్ భద్రతపై చర్చ మొదలైంది.
భద్రతా పనుల్లో AI సహకారం
ఈ నేపథ్యంలోనే ఓపెన్‌ఏఐ డేబ్రేక్‌ను రంగంలోకి దింపింది.కోడ్ రివ్యూ, థ్రెట్ మోడలింగ్, ప్యాచ్ వెరిఫికేషన్, రిస్క్ అనాలిసిస్ వంటి భద్రతా పనుల్లో AI సహకారం అందించేలా దీనిని రూపొందించారు.
ఇప్పటికే క్లౌడ్‌ఫ్లేర్, ఒరాకిల్, సిస్కో వంటి కంపెనీలతో కలిసి ఓపెన్‌ఏఐ పనిచేస్తోంది. డేబ్రేక్‌లో GPT-5.5, GPT-5.5, GPT-5.5-Cyber వంటి ప్రత్యేక AI మోడళ్లను ఉపయోగించడం ద్వారా వివిధ రంగాల్లో సైబర్ ముప్పులను సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని సంస్థ తెలిపింది.


