Homeఆంధ్రప్రదేశ్స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తికి నిద‌ర్శ‌నం మ‌న జెండా

స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తికి నిద‌ర్శ‌నం మ‌న జెండా

- Advertisement -


— ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటీ ;  ఏ జెండా చూస్తే యావత్‌ దేశం గర్వంగా తలెత్తుకుంటుందో ,  ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం,  అనుబంధం కనిపిస్తుందో అదే మూడు రంగుల జెండా మన జాతీయ జెండా అని  రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని స్థానిక తిలక్‌ రోడ్డులోని తన కార్యాలయం వద్ద టీడీపీ నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ మన తెలుగువాడు రూపొందించిన జెండా   ప్రపంచంలోనే అతి శక్తివంతమైన జెండాఅని,   స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తికి ఇది నిదర్శన‌మ‌ని అన్నారు. 78 ఏళ్లు పూర్త చేసుకుని తొందరలోనే 100 సంవత్సరాల ఉత్సవాలకు సిద్ధమవుతున్నామని, అందులో భాగంగా ఆజాదిక అమృత్‌ మహోత్సవం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరిలో దేశ భక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో హర్‌ గర్‌ తిరంగ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. అయితే పారిశుద్ధ్యం పరంగా రాజమహేంద్రవరం నగరానికి ఇంకా స్వాతంత్య్ర రాలేదన్నారు. పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని మనం గుర్తించాలన్నా పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ప్రజల సహకారం చాలా అవసరమన్నారు. అందరం కలిసికట్టుగా పని చేద్దాం… నగరాన్ని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నగర కమిటీ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు