Tuesday, April 29, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

యువర్స్ ఫౌండేషన్ సంస్థ.
విశాలంద్ర ధర్మవరం:: పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, ఉపాధ్యక్షులు సుంకు సుకుమార్, కార్యదర్శి జయరాం కోశాధికారి వంకదారి మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వాతి క్లినిక్ నందు మే నెల నాలుగవ తేదీ నిర్వహించబడే ఉచిత కంటి వైద్య శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కంటి వైద్య శిబిరం యువర్ ఫౌండేషన్, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు(బెంగళూరు బెస్ట్ లయన్స్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి) జిల్లా అందత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరం మే 4వ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు కందికేరి బసమ్మ, కీర్తిశేషులు కందికేరి సోమశేఖర్ జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించడం జరుగుతున్నదని తెలిపారు. గత 30 సంవత్సరాల నుండి ధర్మవరం పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలకు వేల మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించి కంటి చూపును ప్రసాదించడం జరిగిందని తెలిపారు. ఉచిత వైద్య చికిత్సలు, ఉచిత ఆపరేషన్లు, ఉచిత వసతులు కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కంటి శుక్లములు ఉన్న వారిని పరీక్షించి ఉచితంగా ఆపరేషన్కు కూడా చేయబడునని తెలిపారు. ఈ శిబిరమునకు వచ్చువారు ఆధార్ కార్డు జిరాక్స్, ఓటర్ ఐడి జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబర్తో రావాల్సి ఉంటుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని కంటిచూపును ప్రసాదించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో రాధాకృష్ణ చార్టెడ్ ప్రెసిడెంట్ కోలా ప్రభాకర్, డాక్టర్ బి.వి సుబ్బారావు, మాజీ అధ్యక్షులు కోటేశ్వరరావు, చాంద్ బాషా, కౌన్సిలర్ కేత లోకేష్, జయంతి వినోద్ కుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు