విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని అర్హులందరికీ పెన్షన్ పంపిణీ చేయడమే మా లక్ష్యము అని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మే ఒకటవ తేదీన తెల్లవారుజామున నుండే పింఛన్లను పురపాలక అధికారులు, సిబ్బంది పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కమిషనర్ పట్టణంలోని పలుచోట్ల పెన్షన్ పంపిణీలపై ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. అనంతరం కొంతమందికి నేరుగా మున్సిపల్ కమిషనరే పెన్షన్ పంపిణీ చేశామన్నారు. పట్టణంలో మొత్తం 18,001 మందికి పెన్షన్ గాను 17,000 మందికి పెన్షన్లు పంపిణీ మా సిబ్బంది చేయడం జరిగిందన్నారు. పెన్షన్ యొక్క పలు రకాలలో 4000, 6000, 15000, 10000 రూపాయల చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పంపిణీ చేయడం జరిగిందన్నారు. మొత్తం మీద 94.5 శాతము పెన్షన్ పంపిణీ నమోదు అయినట్టు వారు తెలిపారు. మరో రెండు రోజుల్లో పెన్షన్ తీసుకొని వారికి నేరుగా ఇంటి దగ్గరికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
అర్హులందరికీ పెన్షన్ పంపిణీ చేయడమే మా లక్ష్యం.. మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
RELATED ARTICLES