Saturday, March 29, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసేవా కార్యక్రమాలు చేయడమే మా ధ్యేయం..

సేవా కార్యక్రమాలు చేయడమే మా ధ్యేయం..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు
విశాలాంధ్ర ధర్మవరం;; సేవా కార్యక్రమాలు చేయడమే మా ధ్యేయమని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు, ఓము దుర్గా, ప్రదీప్, మహేంద్ర, గణేష్, అఖిల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు సినీ యాక్టర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ హాస్పిటల్ లోని రోగులకు, సాయిబాబా గుడి, గాంధీనగర్, కొత్తపేట, తదితర ప్రాంతాల్లో భోజనపు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్ లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మా హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా పలు సేవా కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కావాలన్నదే మా ఆకాంక్ష అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు