Sunday, January 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయము.. రోటరీ క్లబ్ కమిటీ

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయము.. రోటరీ క్లబ్ కమిటీ

విశాలాంధ్ర ధర్మవరం:; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని సాంస్కృతిక మండలి లో ఈనెల 19వ తేదీ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) నిర్వహించబడు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం యొక్క కరపత్రాలను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఆపరేషన్ల వైద్య శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి-బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ- అనంతపురం జిల్లా వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి నిపుణుల సలహాలతో,కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. శిబిరంలో కంటి వైద్య చికిత్సలు నిర్వహించుకున్న పిదప, ఆపరేషన్లకు ఎంపికైన వారికి పూర్తిగా ఉచిత వసతి తో పాటు ఉచిత ఆపరేషన్లు, ఉచితంగా కంటి అద్దాలు, ఉచిత రవాణా సౌకర్యం కూడా ఇవ్వబడుతుందని తెలిపారు. శిబిరానికి వచ్చువారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డులతో ఏదేని ఒకటి రెండు జిరాక్స్ కాపీలతో, మూడు ఫోటోలతో తప్పకుండా రావాలని తెలిపారు. అదేవిధంగా ఈ హెచ్ ఎస్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు మిగిలిన ఏ కార్డులు కూడా తీసుకొని రావలసిన అవసరం లేదని వారి స్పష్టం చేశారు. వైద్య శిబిరంలో దాతలుగా సింగం రెడ్డి వెంకట లక్ష్మమ్మ, సింగం రెడ్డి రామిరెడ్డి-రిటైర్డ్ టీచర్, కోడలు సింగం రెడ్డి మమత, కుమారుడు సింగం రెడ్డి వెంకటరామిరెడ్డి వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. క్యాంపు చైర్మన్గా విజయభాస్కర్ వ్యవహరిస్తారని తెలిపారు. అదేవిధంగా మా రోటరీ క్లబ్ లో కూడా నేత దానం చేస్తూ అందత్వాన్ని నివారించాలని తెలిపారు. రెండు జీవితాలలో వెలుగు కూడా నింపాలని వారు తెలిపారు. రక్తదానం చేస్తూ ప్రాణదాతలు కావాలని కూడా తెలిపారు. కావున ఈ ఉచిత కంటి వైద్య శిబిరమును పట్టణములోని, గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు కృష్ణమూర్తి, కొండయ్య, సత్రశాల ప్రసన్నకుమార్, శివయ్య, గట్టు హరినాథ్, రత్నశేఖర్ రెడ్డి,రమేష్ బాబు, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యురాలు అంబికా, శుక్లాదేవి తదితరులు పాల్గొన్నారు.
భక్తాదులకు భోజనపు ప్యాకెట్లు పంపిణీ;; వైకుంఠ ఏకాదశి సందర్భంగా పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయము నుండి వచ్చు భక్తాదులకు రోటరీ క్లబ్ తరఫున దాదాపు 500 మందికి భోజనపు ప్యాకెట్లతోపాటు, వాటర్ ప్యాకెట్స్ కూడా పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. దీంతో రోటరీ క్లబ్ చేస్తున్న ఇటువంటి సేవలు పట్ల భక్తాదులు కూడా కృతజ్ఞతలను తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు