సంయుక్త మసీద్ కమిటీ వెల్లడి
విశాలాంధ్ర ధర్మవరం;; వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రద్దు చేసేంతవరకు మా పోరాటాలు ఆగవని పట్టణంలోని మసీదు కమిటీ తెలిపారు. ఈ సందర్భంగా రెండవ రోజు పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమం జామియా మసీద్ అధ్యక్షతన జరిగింది. తదుపరి హిందూ ముస్లిం సోదరులతో నిరాహార దీక్ష కొనసాగడం జరిగింది. ఈ దీక్షలు 20వ తేదీ వరకు కొనసాగిస్తామని తెలిపారు. కొత్త సవరణ చట్టం వెనక్కి తీసుకునేంతవరకు పలు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో పలు సంఘాల వారు సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు రద్దు చేసేంతవరకు మా పోరాటాలు ఆగవు..
RELATED ARTICLES