Saturday, April 26, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివేసవి ఉచిత చదరంగం శిక్షణ శిబిరానికి విశేష స్పందన..

వేసవి ఉచిత చదరంగం శిక్షణ శిబిరానికి విశేష స్పందన..

కళాజ్యోతి అధ్యక్షులు నారాయణప్ప
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతిలో వేసవి ఉచిత చదరంగం శిక్షణ శిబిరానికి విశేష స్పందన రావడం పట్ల కళాజ్యోతి అధ్యక్షులు నారాయణప్ప , ఉపాధ్యక్షులు సింగనమల రామకృష్ణ,కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి, చదరంగమును ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత చదరంగం శిక్షణ తరగతులు ఈనెల 25 నుండి మే నెల 25వ తేదీ వరకు అనగా దాదాపు 30 రోజులు పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ నియమ నిబంధనలతో కూడిన ఆటను నేర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ కళాజ్యోతి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలిపారు. కావున ఆసక్తిగల చదరంగా క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ శిక్షణా శిబిరానికి 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ సత్యసాయి జిల్లా వీటి పిడిఎస్ కార్యదర్శి రాష్ట్రస్థాయి పీఈటి అండ్ పిడిఎస్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ సీనియర్ అంతర్జాతీయ చెస్ క్రీడాకారులు, రిటైర్డ్ లెక్చరర్ సోమశేఖర్ ప్రసాద్ ఎక్స్, లైన్స్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాలాచార్యులు, లైన్స్ క్లబ్ కార్యదర్శి రమేష్ బాబు, లైన్స్ క్లబ్ కోశాధికారి నాగేంద్ర, క్యాప్ శిక్షకులు బి,శివకృష్ణ., ఆదిరత్నం, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు