Homeజిల్లాలుశ్రీ సత్యసాయిస్వామిత్వ సర్వే,అంగన్వాడీ కేంద్రం, హెల్త్ సబ్ సెంటర్ తనిఖీ

స్వామిత్వ సర్వే,అంగన్వాడీ కేంద్రం, హెల్త్ సబ్ సెంటర్ తనిఖీ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం : రెవెన్యూ డివిజన్ పరిధిలోని చెన్నై కొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామంలో అమలు అవుతున్న స్వామిత్వ సర్వే, అంగన్వాడి కేంద్రం హెల్త్ సబ్బు సెంటర్ ను ధర్మవరం ఆర్డీవో మహేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆర్‌డీఓ గారు స్వామిత్వ బృందం పనితీరును సమీక్షించి, గ్రామస్థులతో స్వామిత్వ పథకం లక్ష్యాలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ పరస్పర చర్చలు జరిపారు. అలాగే వెక్టర్ైజేషన్ డేటాతో భౌతిక విస్తీర్ణాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసి ఖచ్చితత్వం , పారదర్శకతను నిర్ధారించారు. ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారు లను వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలోడీడీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ, ఈఓఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ,విలేజ్ సర్వేయర్ పాల్గొన్నారు. తదుపరి ఆర్డీవో సీకే పల్లి మండలం, నాగసముద్రం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం , సబ్ సెంటర్‌ను కూడా పరిశీలించారు. కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, సేవల అందజేత , నిర్వహణను సమీక్షించారు. ముఖ్యంగా మహిళలు , పిల్లలకు అందుతున్న సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ , సబ్ సెంటర్ పరిశీలనలో డీడీఓ, తహసీల్దార్ ఎంపీడీఓ పాల్గొన్నారు.గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలు ప్రజలకు మెరుగైన సేవల అందజేతకు కృషి చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు