శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రజల పక్షాన పోరాటం చేసేదే సిపిఐ అని, పోరాటాల ఫలితాలలో ప్రజలకు సరైన న్యాయమును చేకూర్చడం జరుగుతుందని శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలంలో ఏర్పాటుచేసిన సమావేశానికి వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి తో పాటు నియోజకవర్గంలోని సిపిఐ నాయకులు కార్యకర్తలు కలిసి 2025 సిపిఐ క్యాలెండర్ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటికే నూరు సంవత్సరాలు చరిత్ర కలిగిన సిపిఐ దేశస్థాయిలో రాష్ట్రస్థాయిలో ఎన్నో విజయాలను సాధించి రాజ్యాల మన్నలను చూర గున్నదని తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ శ్రామిక వర్గ పార్టీ అని అది కార్మికుల రైతుల శ్రమజీవులతో కూడిన స్వచ్ఛంద సంస్థ అని తెలిపారు. సోషలిజం కమ్యూనిజం సిద్ధాంతాలకు అంకితమైన మేధావి వర్గాలు ఇతరులతో కూడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని న్యాయబద్ధమైన సోషలిస్టు సమాజ లక్ష్యసాధనకు కట్టుబడి ఉందని తెలిపారు. సిపిఐ పార్టీ ప్రజలతో రోజువారి సంబంధాలు పెట్టుకుని తన పరిధిలో పార్టీ కార్యకలాపాలను అభివృద్ధి చేసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరంతర ప్రక్రియపై పోరాటం చేసేదే సిపిఐ అని వారు స్పష్టం చేశారు. సిపిఐ చరిత్ర పోరాటాలు త్యాగాలు ఎన్నో చేసిందన్నారు. నూరు సంవత్సరాలు చరిత్ర కలిగిన సిపిఐ లో జరిగిన కాలమంతా పోరాటాలు, త్యాగాల చరిత్ర, దేశం కోసం ప్రజల కోసం గొప్ప పోరాటాలు చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు రక్తము, స్వేదం చిందించిన తర్వాతనే మనం పురోగతిని సాధించడం జరిగిందని, తెలిపారు. దేశం, రాష్ట్రం నలుమూలల నుంచి అంకితభావం గల కమ్యూనిస్టులంతా సమీకృతులై సిపిఐ ని స్థాపించుకోవడం జరిగిందన్నారు. సిపిఐ స్థాపన తర్వాతనే మన స్వాతంత్ర పోరాటం మార్గం గొప్ప మార్పు రావడం జరిగిందని తెలిపారు. స్వాతంత్య పోరాటంలో సిపిఐ అగ్ర భాగాన నిలిచిందన్నారు. ఉద్యమం మన పార్టీ ప్రణాళికకు భిన్న సైధాంతిక భావాజాలముల అంతర్గతంగా అనుసంధానమైన పాత్ర వహించడం జరిగిందని తెలిపారు. కార్మికులు, కర్షకులు, మహిళలు, అనగారిన వర్గాల సమస్యలను, బాధలను ఎలగెత్తడం కోసమే మన పార్టీ ఉందన్నారు. ప్రజా ఐక్యతకు సిపిఐ పునాది అని, భారత స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత జరిగిన ఉద్యమాలలో భారత కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు. ప్రజల కష్టాలపై దృష్టి సారిస్తూ వారికి న్యాయమ అందించడమే లక్ష్యంగా సిపిఐ నేడు నూరు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషదాయకం అని తెలిపారు. సిపిఐ క్యాలెండర్లు ప్రతి కార్యకర్త నాయకుల్లో ఉండడంవల్ల ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి మధు చేనేత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జింక చలపతి, సిపిఐ మండల కార్యదర్శి మండల వెంకటేష్, బత్తలపల్లి సిపిఐ నాయకుడు కాటమయ్య, ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కమతం కాటమయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి రామకృష్ణ, సత్యనారాయణ ,సత్యప్ప ,రామదాసు, వెంకటప్ప, ఆదెప్ప ,నాగరాజు తో పాటు ఏఐటియుసి నాయకులు, మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజల పక్షాన పోరాటం చేసేదే సిపిఐ..
RELATED ARTICLES