విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ఇంజనీరింగ్ చేరాలని విద్యార్థుల జీవిత కలల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు , విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు పల్లె ఉమా ట్రస్ట్ నేతృత్వంలో పి వి కె కె ఇంజనీరింగ్ కళాశాలలో ఉచిత ఎంసెట్ కోచింగ్ మార్చి 25, 2025 నుండి మే 10, వరకు నిర్వహిస్తున్నట్లు శ్రీ బాలాజీ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు పల్లె రఘునాథ్ రెడ్డి, కళాశాల చైర్మన్ పల్లె కిషోర్ తెలిపారు. ఎంసెట్ పరీక్ష పై సంపూర్ణ పరిజ్ఞానాన్ని, నిపుణుల సలహాలు, సూచనలు, శిక్షణను ఇచ్చి తర్ఫీదు ఇస్తామ న్నారు. ఈ అవకాశం ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని విజయ శేఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మరిన్ని వివరాలు సందేహాలకు 8886630029 , 8886630031 సంప్రదించాలని కోరారు.