ఏపీ పోలీస్ అకాడమీ కోచ్ మురళీకృష్ణారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులకు చదువుతోపాటు కరాటే క్రీడలను కూడా తల్లిదండ్రులు తప్పక నేర్పించాలని ఏపీ పోలీస్ అకాడమీ కోచ్ మురళీకృష్ణారెడ్డి, కదిరి సీనియర్ కరాటే మాస్టర్ అక్బర్ అలీ, హ్యూమన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్ లాయర్ సుమలత తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని జీవి ఈ జెడ్పీ గర్ల్స్ హైస్కూల్లో ముఖ్య అతిథుల ఆధ్వర్యంలో 80 మంది విద్యార్థులు బెల్ట్ గ్రేడింగ్ పోటీపరీక్షలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శన పోటీలో 50 మంది విద్యార్థులకు బెల్టు, ప్రశంసా పత్రాలు,, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, పర్పల్, రాహుల్, బెల్స్ ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం
మల్టీ స్టార్ ఆల్ ఇండియా బుడోకాన్ కరాటే అకాడమీ కరాటే మాస్టర్లు ఇనాయత్ భాష, నవ్య శ్రీ ,ఉదయ్ ఆధ్వర్యంలో జరిగాయి. తదుపరి పాఠశాల ఉపాధ్యాయ బృందం పిఈటి స్వరూప,సరళ. వీరందరి చేతుల మీదుగా పిల్లలకు బెల్ట్లు ప్రశాంశపత్రాలు అందజేశారు. కరాటే లాంటి యుద్ధ నేర్చుకోవడం వలన తమకు తాము రక్షించుకునే విధంగా ఎంతగానో ఉపయోగ పడుతుందని పిల్లలకు, పిల్లల తల్లితండ్రులకు తెలియజేశారు. అలానే స్పోర్ట్స్ కోట కింద 3 శాతము రిజర్వేషన్, అలానే ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి అని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ కరాటే అండ్ జూడో లాంటి క్రీడా రంగాలలో ఉంటూ మీ ఉజ్జలమైన మీ భవిష్యత్తును బంగారు బాటగా మలుచుకోవాలని తెలిపారు. ఇటువంటి కరాటే ప్రదర్శన పట్ల తల్లిదండ్రులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
విద్యార్థులకు చదువుతోపాటు కరాటే క్రీడను కూడా తల్లిదండ్రులు తప్పక నేర్పించాలి
- Advertisement -
RELATED ARTICLES


