Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరహదారుల దుస్థితిపై పరిటాల శ్రీరామ్ స్పందన

రహదారుల దుస్థితిపై పరిటాల శ్రీరామ్ స్పందన

- Advertisement -

ధర్మవరం మండల వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్దించండి
విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం మండలం ఏలుకుంట్ల–మారాల మరియు ఏలుకుంట్ల–సిద్ధరాంపురం మామిడి తోటల ప్రాంతంలో రహదారి దుస్థితిపై ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ స్పందించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ ఫోన్ లో పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి ఈ పాండు రంగారెడ్డితో మాట్లాడీ రహదారి గురించి చర్చించారు. అనేక సార్లు టిడిపి నేతలు మీ దగ్గరికి వచ్చారని ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్భంగా పంచాయత్ రాజ్ డీ.ఈ మాట్లాడుతూ ఇప్పటికే మారాల–సిద్ధరాంపురం రోడ్ల వర్క్ ఎస్టిమేట్లు వేయించామని వెంటనే రోడ్లు నిర్మించేందుకు ప్రతిపాదన సిద్ధం చేస్తామని తెలిపారు. వీటితోపాటు మండలంలో పలు రోడ్ల ఎస్టిమేషన్లను సిద్ధం చేశామని వెంటనే పనులు ప్రారంభిస్తామని పరిటాల శ్రీరామ్ కు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు