సాధారణ కార్యకర్త నుండి జాతీయ కార్యదర్శి వరకు పరుచూరి పయనం…
విశాలాంధ్ర నందిగామ:-అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్)జాతీయ కార్యదర్శి గా నందిగామ కు చెందిన పరుచూరి రాజేంద్ర బాబు ఎన్నిక అయ్యారు. తిరుపతిలో ఈ నెల 15 వ తేదీ నుంచి 18 వరకు జరిగిన ఏ ఐ వై ఎఫ్ జాతీయ 17 వ మహాసభల్లో పరుచూరి రాజేంద్రబాబు ను ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శిగా సభ్యులు ఎన్నుకున్నారు.దివంగత సూర్యదేవర నాగేశ్వరరావు స్పూర్తి తో(సిపిఐ)కమ్యూనిస్టు భావజాలంతో విద్యార్థి దశ నుండే విద్యార్థుల హక్కుల కోసం పోరాడి విద్యార్థి(ఏఐఎస్ఎఫ్) సంఘం లో కీలకంగా వ్యవహరించిన రాజేంద్ర నియోజకవర్గ కార్యదర్శి గా,జిల్లా కార్యదర్శి, రాష్ట్ర సహాయ కార్యదర్శి గా పనిచేసి కృష్ణా యూనివర్సిటీ సాధన కోసం,విద్యార్ధి సమస్యల పై అనేక పోరాటాలకు ప్రధాన పాత్ర పోషించారు. అనంతరం యువజన సమాఖ్య లో కీలకంగా వ్యవహరించారు.గత ప్రభుత్వం హయాంలో ఎన్నికల వాగ్దానాలు నిలబెట్టు కోవాలనీ,జాబ్ క్యాలెండర్, ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని బస్సు యాత్రలు నిర్వహించారు,అనేక పోరాటాలలో కీలకంగా వ్యవహరించి కేసులను సైతం ఎదుర్కొన్నారు. ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శిగా తొలిసారిగా నందిగామ వాసి కి అవకాశం దక్కింది. పరుచూరి రాజేంద్ర బాబు ఎన్నిక పట్ల పలువురు రాష్ట్ర,జిల్లా యువజన,విద్యార్థి, నాయకులు కమ్యూనిస్టు నాయకులు చుండూరు సుబ్బారావు హర్షం వ్యక్తం చేసి పరుచూరి రాజేంద్ర కు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా పరుచూరి రాజేంద్ర బాబు మాట్లాడుతూ తన పై మరింత బాధ్యత పెరిగిందని, యువజన సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన ఏఐవైఎఫ్ జాతీయ నాయకత్వానికి తన వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న నందిగామ,జగ్గయ్య పేట, ఎన్టీఆర్ జిల్లా వామపక్ష నాయకులు,సానుభూతి పరులు,అభ్యుదయ వాదులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఎన్నిక పట్ల సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు,స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేసారు