Monday, March 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య చికిత్సలను అందించాలి..

ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య చికిత్సలను అందించాలి..

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి.. ఫైరోజా బేగం
విశాలాంధ్ర ధర్మవరం:: ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య చికిత్సలను అందించే విధంగా వైద్యులు సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఫైరోజ్ బేగం తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆకస్మికంగా పట్టణంలోని సాయి నగర్, దుర్గా నగర్, కొత్తపేట, గాంధీ నగర్, శివానగర్లలో గల ప్రైమరీ హెల్త్ సెంటర్లను తనిఖీ చేశారు. తదుపరి పలు రికార్డులను, హాజరు పట్టికను వారు పరిశీలించారు. తదుపరి వారు మాట్లాడుతూ ఎన్ సి డి సి డి సర్వేలపై నూరు శాతం పూర్తిగా సకాలంలో చేయాలని తెలిపారు. ఎమర్జెన్సీ రికార్డ్స్ ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ,మందుల స్టాక్ రికార్డ్స్, వ్యాధి నిరోధక టీకాల నిల్వల పై శ్రద్ధ కనపరచాలని తెలిపారు. అక్కడకు వచ్చిన రోగులతో వైద్య చికిత్సల పట్ల ఆరా తీశారు. రోగులకు వైద్యం అందించుటలో నిర్లక్ష్యం వహించినచో కఠిన చర్యలు తప్పవని కూడా వారు హెచ్చరించారు. సమయపాలన, విధులను సేవాభావంతో నిర్వర్తించుట, ఆయా అర్బన్ హెల్త్ సెంటర్లు మంచి గుర్తింపు తెచ్చేలా, సమన్వయంతో అధికారులు సిబ్బంది పనిచేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్. సెల్వియా సాల్మన్, మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు