జిల్లా అధ్యక్షులు రోషన్ జమీర్
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు పలు సేవా కార్యక్రమాలను ఎం ఎం డి ఏ ద్వారా మున్ముందు కూడా నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షులు రోషన్ జమీర్ తెలిపారు. ఈ సందర్భంగా వారి ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ ద్వారా ఆకర్షితులైన పట్టణంలోని పలువురు సభ్యత్వం తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారు మాట్లాడుతూ తాము కూడా సమాజానికి సేవ చేస్తామని తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు దాదా పీర్, సభ్యులు మహమ్మద్, నసురుద్దీన్, అల్లా ప్రకాష్, కాసిం ,అనీష్ తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు మునుముందు కూడా నిర్వహిస్తాం..
RELATED ARTICLES