బాక్సాఫీస్ ఛాంపియన్ అంటూ చిత్ర బృందం పోస్టర్
హైదరాబాద్: ఆటలో, పోరాటంలోనూ ఛాంపియన్ అనిపించుకున్నాడు ‘పెద్ది’. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చి హిట్‌గా నిలిచింది. పెద్దిగా రామ్ చరణ్ తన నటనతో మెప్పిస్తూ చాలా రోజుల తర్వాత ఆయన ఖాతాలో హిట్ పడిందంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్‌ను నిర్మాణ సంస్థ తాజాగా వెల్లడించింది. ప్రంపచవ్యాప్తంగా ఫస్ట్‌డే రూ.135.36 కోట్లు వసూలుచేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ‘బాక్సాఫీస్ ఛాంపియన’ అంటూ పోస్టర్ విడుదల చేసింది. మొదటి రోజు కలెక్షన్స్‌లో తొలి పది చిత్రాల్లో ‘పెద్ది’ నిలిచింది.
గుర్తింపు కోసం సాగే పోరాటమే ‘పెద్ది’ కథ…
1990ల నేపథ్యంలో విజయనగరం పరిసర ప్రాంతాల్లోని చెరకు కార్మికుల జీవితాల ఆధారంగా తెరకెక్కించారు. జిల్లాలోని కొండ కింద ఊరు అది. వందల మంది జీవనం సాగిస్తున్నా, ప్రభుత్వ రికార్డుల్లో ఆ ఊరికి గుర్తింపు అన్నదే ఉండదు. అందుకే ఆ ఊరు అన్నా, అక్కడి నుంచి వచ్చిన మనుషులన్నా అందరికీ చిన్న చూపు. ఆ ఊళ్లో పుట్టి పెరిగినవాడే పెద్ది (రామ్‌చరణ్). రోజూ విజయనగరం వెళ్లి కూలి పనులు చేసుకుంటుంటాడు. పేరుకి కూలి అయినా క్రికెట్లో మాత్రం రాటుదేలిన ఆటగాడు. అందుకే విజయనగరం, బొబ్బిలి క్రికెట్ జట్లు వేలంలో పెద్దిని కొనేందుకు పోటీపడుతుంటారు. అలాంటి ఆటగాడు క్రికెట్‌ని వదిలి కుస్తీ క్రీడాకారుడిగా ఎందుకు మారాల్సివచ్చింది? ఆ తరువాత పారా అథ్లెట్‌గా ఎలా మారతాడు? పెద్ది ప్రయాణంపై అప్పలసూరి (జగపతిబాబు), గౌర్నాయుడు (శివరాజ్‌కుమార్) ఎలాంటి ప్రభావం చూపించారు? ఈ కథలో అచ్చియమ్మ (జాన్వీ కపూర్) ఎవరు? అనేదానిపై సినిమా కథ సాగుతుంది.
‘పెద్ది’ ఫస్ట్‌డే రికార్డ్ కలెక్షన్స్
- Advertisement -
RELATED ARTICLES


