Wednesday, March 12, 2025
Homeజిల్లాలుఅనంతపురంపెండింగ్ లో ఉన్న ఉపాధి హామి కూలీల వేతనాలు తక్షణమే చెల్లించాలి

పెండింగ్ లో ఉన్న ఉపాధి హామి కూలీల వేతనాలు తక్షణమే చెల్లించాలి

ఎండలు భగ భగ- మజ్జిగ, మంచినీరు లేక కూలీలు విలవిల
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల. మల్లికార్జున

విశాలాంధ్ర అనంతపురం : కందుకూరు గ్రామపంచాయతీ పరిధిలోని కృష్ణం రెడ్డి పల్లి నందు జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పనులు అరకొరగా కల్పిస్తున్నారని చేసిన పనులకు జనవరి నెల నుండి వేతనాలు చెల్లించలేదని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల. మల్లికార్జున పేర్కొన్నారు.
సోమవారం ఉపాధిహామి పనులు పరిశీలన కార్యక్రమం లో భాగంగా జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కేశవరెడ్డి, సిపిఐ రాప్తాడు నియోజకవర్గం పి రామకృష్ణ, ఉపాది హామీ కూలీలను స్వయంగా కలుసుకొని సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
నిత్యావసరవస్తువుల ధరలు కూలీలు కొనుక్కుతినే పరిస్థితిలో లేవని దానికి తోడుగా చేసిన పనులకు నెలలు తరబడి వేతనాలు చెల్లించిక పోతే ఉపాదిహామీ కూలీలు పూట గడవని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అధికారులు ఉపాధి కూలీలు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పనిముట్లు మజ్జిగ మంచినీరు సౌకర్యం ఎండ నుండి ఉపశమనం పొందడానికి నీడ సౌకర్యం మరియు పని చేసేటప్పుడు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగిన ప్రథమ చికిత్స చేసుకోవడానికి మెడికల్ కిట్స్ అందుబాటులో లేదన్నారు. ఇవి ఏమీ లేకుండా పనులు కల్పించడం చాలా బాధాకరమని వృద్ధులకి వికలాంగులకి పనిలేదని వీరికి పనులు కల్పించడం లేదన్నారు. అదేవిధంగా కొలతలతో నిమిత్తం లేకుండా పని గంటలు కేటాయించి రూ. 700 వేతనం 200 రోజులు పనిదినాలుకల్పించి, తక్షణమే ఉన్నత అధికారులు వీటి మీద దృష్టి పెట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ కార్మికుల నియోజకవర్గ నాయకులు రెడ్డప్ప సిపిఐ నాయకులు రామాంజనేయులు రైతు సంఘం నాయకులు నాగేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు