విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మంగళవారం పింఛన్లు పంపిణీ పండుగలా జరుపుకుంటున్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు ఏసేపు, మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలో టీడీపీ గ్రామ అధ్యక్షులు మునెప్ప, నరసింహ రెడ్డి, రాగిమాన్ దొడ్డిలో వెంకటరెడ్డి, చిన్నకడబూరులో గోనుమాన్ నరసన్న, చిన్నతుంబలం గ్రామంలో వీరేష్ గౌడ్, కల్లుకుంట గ్రామంలో దాసప్ప రెడ్డి, తాయన్న అవ్వా తాతలకు ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని ప్రతి నెలా ఒకటో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కలుగొట్ల లక్ష్మన్న, కల్లు, లక్ష్మన్న, నల్లారెడ్డి సభోజరాజు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.