Saturday, March 1, 2025
Homeజిల్లాలువిజయనగరంఐసియు లో పేషెంట్ కి పింఛను పంపిణీ

ఐసియు లో పేషెంట్ కి పింఛను పంపిణీ

విశాలాంధ్ర – నెల్లిమర్ల : నెల్లిమర్ల మండలం సీతారామునిపేట పంచాయతీ పరిధిలోని సచివాలయ పంచాయతీ కార్యదర్శి బంగారు రాజు శనివారం విజయనగరం వెంకటరామ హాస్పిటల్ కి వెళ్లి సామాజిక పింఛను లబ్దిదారునికి అందజేశారు. నెల్లిమర్ల మండలం సీతారామునిపేట పంచాయతీకి చెందిన బూర్లి సత్యం అనారోగ్యం కారణంగా విజయనగరం వెంకటరామ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. దీంతో బూర్లి సత్యం కి ప్రతి నెలా ఇవ్వాల్సిన పింఛన్ ను సచివాలయ పంచాయతీ కార్యదర్శి బంగారు రాజు సీతారామునిపేట నుంచి విజయనగరం. వెంకట రామ హాస్పిటల్ కి వెళ్లి ఐ సి యు లో ఆపస్మారక స్థితిలో ఉన్న అతనికి అందజేశారు. దీనిపై బంగారు రాజు ని పలువురు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు