విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలో టిడిపి గ్రామ అధ్యక్షులు మునెప్ప శనివారం అవ్వా తాతలకు ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం అవ్వా తాతలకు వరం లాంటిదని స్పష్టం చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన క్రమం తప్పకుండా పింఛన్లు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ దేశ చరిత్రలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.