పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : మండలంలోని చుండి పంచాయతీ లోని కాకర్లపాలెం గ్రామంలో చుండి నుండి అమ్మపాలెం, గాంధీనగర్, లింగసముద్రం పోవు రోడ్డు లో చిన్నపాటి వర్షం పడితే రోడ్డు పై నీళ్లు నిల్వ ఉండడంతో దోమలు బాధతో అల్లాడుతున్నట్లు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు సీసీ రోడ్డు వేసినప్పటికీ దానివల్ల ప్రయోజనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అక్కడ ప్రజలు పేర్కొన్నారు. అధికారులు గ్రామాన్ని సందర్శిస్తే విషయాలు తెలుస్తాయని ప్రజలు కోరుకుంటున్నారు.ఎక్కువ వర్షం పడితే మా బాధలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమలతో ఎక్కువగా రోగాలు వస్తున్నాయని అంటున్నారు.పోయిన నెలలో మా గ్రామం లోజ్వరాలు ఎక్కువగా ఉన్నందున వలేటివారిపాలెం ప్రాథమిక ఆరోగ్యఉపకేంద్రం వారు రొండు రోజులు ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించారని అన్నారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లెపండుగలోనైనా రోడ్డు బాగుచేస్తారని స్థానికులు ఎదురు చూస్తున్నారు.సంబందిత మండలఅధికారులు మా కాకర్లపాలెం గ్రామంలో పర్యటిస్తే విషయం తెలుసుకోవచ్చునని ప్రజలు కోరుకుంటున్నారు.