విశాలాంధ్ర -ధర్మవరం ; శ్రీ సత్యసాయి జిల్లా యందు భారీ ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు నందున ధర్మవరం రెవెన్యూ డివిజన్ ప్రజలందరూ కూడా ఈనెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం డివిజన్ లోని అన్నీ తహశీల్దార్ల కార్యాలయము నందు రెవెన్యూ డివిజినల్ కార్యాలయము, ధర్మవరం నందు కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. రెవిన్యూ డివిజనల్ అధికారి, ధర్మవరం వారి కార్యాలయపు కంట్రోల్ రూము ఫోన్ నెంబర్: 9866057959 గా కలదు అని తెలిపారు. కావున డివిజన్ లోని ప్రజలు భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా వుండాలి అని, అత్యవసర పరిస్థితులలో సంబంధిత తహశీల్దారు కార్యాలయపు కమాండ్ కంట్రోల్ వారిని సంప్రదించవలెనని తెలిపారు. ప్రజలందరు తగు జాగ్రత్తలను పాటించవలెనని తెలిపారు.
ధర్మవరం తహశీల్దారు వారి కార్యాలయం సెల్ నెంబర్ 9553929724,
బత్తలపల్లి తహశీల్దారు వారి కార్యాలయం 7416597120, తాడిమర్రి తహశీల్దారు వారి కార్యాలయం 9391164803,ముదిగుబ్బ తహశీల్దారు వారి కార్యాలయం 6301279595,
చెన్నేకొత్తపల్లి తహశీల్దారు వారి కార్యాలయం 7981734346, కనగానపల్లి తహశీల్దారు వారి కార్యాలయం 8555828121, రామగిరి తహశీల్దారు వారి కార్యాలయం 8500338330 సెల్ నెంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు.
డివిజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆర్డీవో మహేష్
RELATED ARTICLES