జిల్లా మలేరియా అధికారి డి. ఓబులు
విశాలాంధ్ర- అనంతపురం : సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా మలేరియా అధికారి డి. ఓబులు పేర్కొన్నారు. అనంత జిల్లా మలేరియా కార్యాలయం నందు జిల్లా మలేరియా అధికారి డి ఓబులు అధ్యక్షతన శనివారం అనంతపురం జిల్లాలోని మలేరియా సభ్యు యూనిట్ అధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా మలేరియా అధికారి డి ఓబులు మాట్లాడుతూ… గతంలో నమోదైన అనంతపురం జిల్లాలో 52 ఫైలేరియా కేసులకు మార్పిడిటీ మేనేజ్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన కిట్లను మలేరియా సబ్ యూనిట్ అధికారులకు అందజేయడం జరిగిందన్నారు. అసిస్టెంట్ మలేరియా అధికారి కే సత్యనారాయణ మాట్లాడుతూ… జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇంటింటికి వైద్య ఆరోగ్య సిబ్బంది క్రమం తప్పకుండా క్షేత్ర స్థాయిలో ఫీవర్ సర్వే నిర్వహించి ప్రజలకు కాలానుగుణ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన జాతీయ కీటక జీవిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమ కీటక జనిత నియంత్రణ వ్యాధుల నియంత్రణ కరపత్రాలను గ్రామాలలో సిబ్బంది ఇంటింటికి పంపిణీ చేయాలన్నారు. అందుకు సంబంధించిన మెటీరియల్ను మరియు జాగ్రత్త వైద్యం దోమల నుండి కాపాడుకుందాం మలేరియా, డెంగ్యూ, మెదడువాపు వ్యాధుల నివారణ చర్యలు గురించిన కరపత్రాలను సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సమావేశంలో ఎంపీ హెచ్ ఈ ఓ లు కె గిరిధర్ రెడ్డి, బత్తుల కోదండరాంరెడ్డి, మద్దయ్య, మునాఫ్,రామకృష్ణ, నాగేంద్రప్రసాద్, రమేష్, హెల్త్ సూపర్వైజర్లు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.