Thursday, March 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆరోగ్యం పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి..

ఆరోగ్యం పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి..

న్యూరాలజీ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ఆరోగ్యాల పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకోవాలని న్యూరాలజీ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాయి నగర్, సాయిబాబా గుడి దగ్గర గల స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యందు ఉచిత న్యూరాలజీ వైద్య శిబిరమును హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉచిత శిబిరంలో మెదడు, వెన్నుపాము, నరముల వైద్య విభాగములలో వైద్య చికిత్సలను అందిస్తూ, వాటికి తగ్గ మందులను, సలహాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. తదుపరి మూర్ఛ వ్యాధి, ఫిట్స్, నరముల వ్యాధి సమస్యలు కలవారికి, పార్కిషన్ వ్యాధి, అల్జీమర్స్ వ్యాధి, కాళ్లు చేతులు జోములు, టిమ్మర్లు కలవారికి, మైగ్రేన్, తలనొప్పి తో బాధపడుతున్న వారికి వైద్య చికిత్సలను అందించి, ఆరోగ్య సూత్రాలను కూడా తెలపడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా షుగర్, బిపి ఈసీజీ పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. కల్తీ ఆహారం, కల్తీ మద్యం, సిగరెట్టు, మద్యపానం లాంటివి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతిస్తాయన్నారు. ప్రతి రోగమునకు తగ్గ వైద్య చికిత్సలను వైద్య నిపుణుల డాక్టర్ చే మాత్రమే అందించుకోవాలని, ఆర్ఎంపీ డాక్టర్లను సంప్రదించడం, సొంత వైద్యం చేయించుకోవడం ప్రాణానికే ముప్పు అని తెలిపారు. అదేవిధంగా గుండెపోటు అనేది ప్రాథమిక దశలోనే గుర్తించాలని తెలిపారు. శరీరంలోని అవయము బట్టి రోగము ఉంటుందని, ఆ రోగముకు తగ్గ ప్రత్యేక వైద్యుల చికిత్సలు అందించుకోవాలని తెలిపారు. అన్నింటికన్నా శరీరంలో అతి ముఖ్యమైన భాగం మెదడు, వెన్నుపాము అని తెలిపారు. వీటి విషయంలో జబ్బును ముందుగానే గుర్తించి తగిన సమయంలో వైద్య చికిత్సలు అందించుకోవాలని తెలిపారు. అనంతరం స్పందన హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియాలు మాట్లాడుతూ ఇటీవలే ధర్మవరంలో ప్రజల కోరిక మేరకు స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించడం జరిగిందని, మొట్టమొదటి ఉచిత న్యూరాలజీ వైద్య శిబిరమునకు 180 మంది రోగులు రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు మాకు అత్యంత ప్రీతి పాత్రమైన వారు అని, వారికి అత్యంత విశ్వసనీయమైన సేవలు అందించడం మా ధ్యేయము అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది బాబా ఫక్రుద్దీన్, దిల్దార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు