మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పుష్పలత
విశాలాంధ్ర ధర్మవరం:: ఎల్సిడిసి అనే కార్యక్రమానికి సర్వేలో ప్రజలు పూర్తిగా సహకరించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పుష్పలత తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలోని గొట్లూరు గ్రామంలో ఎల్సీడీసీ కార్యక్రమంలో భాగంగా వారు ఆకస్మికంగా పరిశీలించారు. సర్వే సజావుగా జరుగుతున్నదా? లేదా? ప్రజలు వాస్తవాలు చెబుతున్నారా?లేదా? అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రజలకు కుష్టి వ్యాధి గురించి అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ సర్వే ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజశేఖర్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ ఆంజనేయులు, ఏఎన్ఎంలు -నీరజ, అక్కమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎల్సిడిసి సర్వేకు ప్రజలు సహకరించాలి
RELATED ARTICLES