Monday, April 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రజలు ఆరోగ్య విషయంలో శ్రద్ధను వహించాలి..

ప్రజలు ఆరోగ్య విషయంలో శ్రద్ధను వహించాలి..

మెడికల్ ఆఫీసర్ డాక్టర్. పుష్పలత
విశాలాంధ్ర ధర్మవరం:: గ్రామ ప్రజలు అందరూ కూడా ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధను కనపరచాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్. పుష్పలత తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం మండలం దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం డాక్టర్ పుష్పలత మాట్లాడుతూ ఈ ర్యాలీ నందు ప్రజల యొక్క ఆరోగ్య స్థితి మెరుగుపడడానికి ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు వివరించడం జరిగింది అని తెలిపారు. ముఖ్యంగా మాతా శిశు మరణాలను తగ్గించడం, అలాగే ప్రజల జీవన ఆరోగ్య విధానం, ఆహారపు అలవాట్లు మార్చుకొనడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని సాధించవచ్చని తెలిపారు. అలాగే పిఎంజేఏవై కార్డ్స్ ద్వారా 70 సంవత్సరాల పైబడిన వారికి సంవత్సరానికి 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య సేవలు పొందవచ్చు అని తెలిపారు. ఇనిస్టిట్యూషనల్ డెలివరీస్ నిర్వహించడం వల్ల మాతా శిశు మరణాలను తగ్గించవచ్చు అని తెలిపారు. అలాగే టెలి మానస్ ద్వారా మానసిక ఆరోగ్య మద్దతుతో భారతదేశం ప్రజల యొక్క ఆరోగ్య కవరేజ్ పురోగమించేటట్లు చేయవచ్చని తెలిపారు. అంతేకాకుండా హాస్పిటల్ నందు ప్రసవం అయితే జె ఎస్ వై ద్వారా నగదు పరిహారం పొందవచ్చని తెలిపారు. అలాగే ప్రతినెల 9వ తేదీ ,10 వ తేది హై రిస్క్ గర్భవతులకి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమం నందు వైద్య సిబ్బంది, సూపర్వైజర్ రాజశేఖర్ రెడ్డి, ఎంఎల్హెచ్పిలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు