అందజేసిన సిపిఐ నగర కార్యదర్శి ఎన్.శ్రీరాములు
విశాలాంధ్ర -అనంతపురం : కార్పొరేషన్ స్థలాలు కబ్జా దారుల నుంచి కాపాడండి నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ బాలస్వామి కి వినతి పత్రాన్ని గురువారం మున్సిపల్ కార్యాలయంలో సిపిఐ నగర కార్యదర్శి ఎన్.శ్రీరాములు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనంతపురము నగర పాలక సంస్థకు చెందిన కార్పొరేషన్ స్థలాలు కబ్జాకు గురి అవుతున్నాయి అన్నారు.
కార్పొరేషన్కు సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు అనంతపురము నగరంలో నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్ నిర్మిస్తున్నా కమీషన్లకు కక్కుర్తిపడి అడ్డుచెప్పడం లేదన్నారు. నగరపాలక సంస్థ అధికారులు 0.01 సెంటు స్థలంలో ఇంటి నిర్మాణము కొరకు ముఖ్యమంత్రి అనుమతి అవసరం లేదు అని చెప్పినా అధికారులు మాత్రమే అనుమతి తీసుకోవాలని లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారన్నారు . 14 శాతం బెటర్ మెంట్ చార్జెస్ చెల్లించకుండానే కార్టారేషన్ ఆదాయానికి గండి కొడుతూ భవనాలకు అప్రూవల్ ఇవ్వడం జరుగుతుందన్నారు. నగర పాలక సంస్థకు చెందిన ఓపెన్ సైట్ 7.00 ఎకరములు నగరం నడిబొడ్డున ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్టాండ్కు దగ్గరలో వున్న సెంట్రల్ పార్క్ స్థలము దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే 1/ ఎకరాల స్థలం కబ్జాకు గురౌతున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నారు . సిపీఐ పార్టీ ఆందోళనల కారణంగా ప్రత్యేక సర్వే టీం లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సర్వే జరిగినా, ఆ సర్వేలో విషయం బహిర్గతం చేయలేదన్నారు. అయినప్పటికి అక్కడ వైసిపి నాయకులు కట్టడాలు కట్టడం జరిగిందన్నారు. మేము సమాచార హక్కు చట్టం ద్వారా వాటి వివరాలు అడిగినా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. స్థలం కబ్జా చేసిన కబ్జాదారులపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. నగరంలోని ఖాజా నగర్లోని మునిసిపల్ స్కూల్ వద్ద అక్రమంగా పట్టాలు తెచ్చుకున్నారన్నారు. శ్రీనివాసనగర్లోని కబ్జా చేసిన స్థలం గురించి దినపత్రికలలో కథనాలు రావడం జరిగిందన్నారు. వీటిమీద మునిసిపల్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ధర్నా చేసి నగర పాలక సంస్థకు చెందిన ఆస్తులను కాపాడండని అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గతంలో కమీషనర్ కి తెలియజేశామన్నారు.
నగర పాలక సంస్థకు చెందిన స్థలాలకు కంచెలు వేసి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కమీషనర్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. గత కమీషనర్ నిర్లక్ష్యం వల్ల అనంతపురం నగరంలో ఈ మధ్యకాలంలో శ్రీనగర్ కాలనీకి చెందిన ఎల్.పి.నెం. 267-87 ఓపెన్ సైట్ సర్వేనెం. 148-1 విస్తీర్ణము 0.53 సెంట్లు, స్ట నెం. 142-9 విస్తీర్ణము 0.36 సెంట్లు ఎల్.పి.నెం. 942-2000 సర్వేనెంబరు 353 నందు 0.76 సెంట్లు కబ్జా కు గురైందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కబ్జాకు పాల్పడగా మునిసిపల్ అధికారులు అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయగా వాటిని తోలిగించారన్నారు. అయినా మునిసిపాలిటీ అధికారులలో ఎటువంటి స్పందన లేదన్నారు.
శ్రీనగర్ కాలనీ రోడ్డు ఏర్పాటు చేయడానికి మునిసిపల్ అధికారులు వెళ్ళగా, అడ్డుకున్న కబ్జాదారులు. శ్రీనగర్ కాలనీ యందు కోట్ల రూపాయల విలువ చేసే ఒపన్ సైట్ స్థలాలపైన కబ్జాదారుల కన్ను పడిందన్నారు. కావున తమరు వెంటనే స్పందించి నగర పాలక సంస్థకు సంబంధించిన స్థలాలను కాపాడాలని అవినీతికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా వినతి పత్రంలో కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర్ సహాయ కార్యదర్శులు కే అలిపిర, బి. రమణ, ఏ.నారాయణస్వామి, ఈ. ప్రసాద్, ఈ జయలక్ష్మి, సి. నాగప్ప, ఆర్ సుందర్ రాజు, ఏ ఐ వై ఎఫ్ ఎస్. శ్రీనివాసులు, ఎస్. పి. ఖాజా హుస్సేన్, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.