Sunday, February 23, 2025
Homeఆంధ్రప్రదేశ్వల్లభనేని వంశీని భవానీపురం పీఎస్ నుంచి మరో చోటుకు తరలిస్తున్న పోలీసులు

వల్లభనేని వంశీని భవానీపురం పీఎస్ నుంచి మరో చోటుకు తరలిస్తున్న పోలీసులు

కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలించారు. తొలుత ఆయనను విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత వెంటనే మరో వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి బయల్దేరారు. మార్గమధ్యంలో ఎస్కార్ వాహనాన్ని పోలీసులు ఆపారు. అక్కడకు మరో పోలీస్ వాహనం వచ్చింది. ఈ సందర్భంగా పోలీసులతో వల్లభనేని వంశీ వాగ్వాదానికి దిగారు. కాసేపు వాగ్వాదం అనంతరం పోలీసుల వాహనాలు బయల్దేరాయి. ఆయను ఎక్కడకు తీసుకు వెళ్తున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. వల్లభనేవి వంశీ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో 144 సెక్షన్ తో పాటు, పోలీస్ యాక్ట్ 30ని విధించారు. నిరసనలు, ర్యాలీలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ తెలిపారు. తమ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు