Homeఆంధ్రప్రదేశ్పోలీసుల కౌన్సిలింగ్ ఫోరం.. ఏ చట్టం కింద ఏర్పాటు చేశారు?: హైకోర్టు ఆగ్రహం

పోలీసుల కౌన్సిలింగ్ ఫోరం.. ఏ చట్టం కింద ఏర్పాటు చేశారు?: హైకోర్టు ఆగ్రహం

- Advertisement -

పోలీసుల వైఖరిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ వివాదాల్లో ఃప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరంః (పీఎల్‌సీఎఫ్) పేరుతో విశాఖ పోలీసులు జోక్యం చేసుకోవడాన్ని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. అసలు సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకునే అధికారం పోలీసులకు ఎక్కడిదని ఈ సందర్భంగా ఘాటుగా ప్రశ్నించింది.పోలీస్ యూనిఫాం ధరించి కౌన్సిలింగ్ నిర్వహించడం అంటే బాధితులను బెదిరించడమేనని హైకోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి చర్యలను అనుమతిస్తే భవిష్యత్తులో సమాంతర న్యాయస్థానాలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సివిల్ వివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత కోర్టులదేనని, పోలీసులది కాదని స్పష్టం చేసింది.ఈ ఫోరంకు ఫిర్యాదులు అందినప్పటికీ, కౌన్సిలింగ్ పేరుతో సివిల్ వివాదాలకు సంబంధించి ఎవరికీ నోటీసులు జారీ చేయవద్దని, వారిని పిలిపించవద్దని పోలీసులను న్యాయస్థానం స్పష్టంగా ఆదేశించింది. ఏ మార్గదర్శకాల ఆధారంగా ఈ ఫోరమ్‌ను ఏర్పాటు చేశారు? ఏ చట్టం కింద నోటీసులు జారీ చేస్తున్నారు? వంటి పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించాలని విశాఖ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు