Monday, February 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు

గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు

ఏడేళ్ల బాలుడు సురక్షితంగా కాపాడిన ధర్మవరం పోలీసులు

శ్రీ సత్యసాయి, కడప జిల్లాల పోలీసులకు రివార్డులు ప్రకటిస్తూ అభినందించిన రాష్ట్ర గౌరవ డీజీపీ
విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం మండలంలోని బడన్నపల్లి గ్రామానికి చెందిన లలిత కాపురానికి రాలేదని భార్యపై, మెట్టినింటికి పంపలేదని అత్తపై వేటకొడవలితో దాడి చేశాడు. లలిత భర్త అంతటితో ఆగలేదు.. తన కుమారుడిని బైక్ పై ఎక్కించుకొని వెళ్లిపోవడంతో ఆ పసికందును ఏం చేస్తాడోనని అందరూ ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న ఆదేశాల మేరకు ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ తమ సిబ్బందిని రంగంలోకి దింపి, అన్ని జిల్లాల పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. పొరుగున ఉన్న కడప జిల్లా వేంపల్లి ప్రాంత పోలీసులకూ సమాచారం ఇచ్చారు. వెంటనే స్థానిక పోలీసుల సహాయంతో ధర్మవరం పోలీసులు నిందితున్ని
భూమయ్య గారిపల్లి గ్రామంలో గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నున్న ఏడేళ్ల కుమారుడినీ సురక్షితంగా కాపాడగలిగారు. పిల్లవాడిని సురక్షితంగా కాపాడినందుకు
రాష్ట్ర గౌరవ డిజిపి, ధర్మవరం డిఎస్పి, అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి రివార్డులు ప్రకటిస్తూ పోలీసుల శ్రమను ప్రశంసించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు