లిక్కర్ గోడౌన్, వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించిన కేసులు
నిందితులకు 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని ఏపీ హైకోర్టు ఆదేశం
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. ఆయన ముఖ్య అనుచరులకు గుడివాడ పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను, పాలడుగు రాంప్రసాద్ లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. లిక్కర్ గోడౌన్ వ్యవహారం, వాలంటీర్లతో బలవంతపు రాజీనామాలు చేయించిన కేసుల్లో వీరికి నోటీసులు జారీ చేశారు. ఈ రెండింటికి సంబంధించి కొడాలి నాని, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి జేసీ మాధవీలతారెడ్డిలపై కూడా గుడివాడ పీఎస్ లో కేసులు నమోదయ్యాయి. కేసులోని నిందితులకు 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని గతంలోనే ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కొడాలి నాని అనుచరులకు తాజాగా పోలీసులు నోటీసులిచ్చారు.
కొడాలి నాని అనుచరులకు పోలీసుల నోటీసులు
RELATED ARTICLES