Tuesday, April 29, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయి30న పాలిసెట్.. ప్రిన్సిపాల్ సురేష్ బాబు

30న పాలిసెట్.. ప్రిన్సిపాల్ సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం; పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కొరకు నిర్వహించ బడు పాలిసెట్ ప్రవేశ పరీక్ష 30-4-25 వ తేదీ నిర్వహించ బడుచున్నదని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పరీక్ష ధర్మవరం పట్టణంలో తారకరామ పురం లోని ప్రభుత్వ పాలిటెక్నిక్, కే హెచ్ డిగ్రీ కళాశాల, ఏపీ మాడల్ స్కూల్ & జూనియర్ కళాశాల, కొత్తపేట లోని మునిసిపల్ బాలికలపాఠశాల, సాయిబాబా గుడి వద్ద గల శ్రీనివాస డిగ్రీ & పీజీ కళాశాల కెంద్రాలలొ నిర్వహించబడునని వారు తెలిపారు. పరీక్ష సమయం ఉదయం 11.00 నుండి 1.00. నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులను ఉదయం 10.00 లకే పరీక్ష హాలు లోకి అనుమతిస్తారు అని తెలిపారు. పరీక్ష కు హాజరు అయ్యే విద్యార్థులు హాల్ టికెట్, పెన్ను, హెచ్ బి పెన్సిలు, ఏరెసర్, షార్పనర్ వెంట తీసుకొని రావలెను అని తెలిపారు. కాళికులెటర్లు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచ్ లు మొదలగు వాటిని పరీక్ష హాల్ లో అనుమతి లేదు అని స్పష్టం చేశారు. పరీక్ష ప్రారంభం సమయం తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కు అనుమతి లేదు అని తెలిపారు. కావున విద్యార్థులందరూ సరియైన సమయానికి పరీక్ష హాలు కు చేరుకోవాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు