Wednesday, February 26, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత కంటి వైద్య శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోండి..

ఉచిత కంటి వైద్య శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోండి..

యువర్స్ ఫౌండేషన్
విశాలాంధ్ర ధర్మవరం;; మార్చి రెండవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వంకదారి మొహన్ తెలిపారు. ఈ సందర్భంగా స్వాతి క్లినిక్ లో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం యువర్స్ ఫౌండేషన్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి వైద్యులచే కంటి శుక్లములు ఉన్న వారిని పరీక్షించి ఉచితంగా ఐఓఎల్ ఆపరేషన్ కూడా చేయబడునని తెలిపారు. ఉచిత వైద్య చికిత్సలు, ఉచిత ఆపరేషన్లు నిర్వహించబడునని తెలిపారు. ఈ శిబిరానికి వచ్చి వారు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు ల జిరాక్సులతో ఫోన్ నెంబర్ తమ వెంట తీసుకొని రావాలని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా మామిళ్ల మాధవి లత, మామిళ్ళ తులసి ప్రసాద్, కీర్తిశేషులు షీలా గంగమ్మ ,కీర్తిశేషులు షీలా పెద్ద ఈశ్వరయ్య జ్ఞాపకార్థం కీర్తి మాల శీలా నాగేంద్రుడు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు చైర్మన్ పోలా ప్రభాకర్, పిఆర్ఓ రాధాకృష్ణ, వై కే శ్రీనివాసులు ,చాంద్ బాషా, బండి నాగేంద్ర, సత్రశాల మల్లికార్జున ,నాగరాజు, బండి నాగేంద్ర, ఎస్ వి ప్రసాద్, బాలం ఆదిశేషులు, సీకే రామాంజనేయులు, సికిందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు